నిమ్మగడ్డి (Lemon grass) -ఔషధంగా.: - పి . కమలాకర్ రావు

 నిమ్మ గడ్డి కమ్మని సువాసనలతో చుట్టూ వున్న వాతావారణాన్ని సుగంధ భరితం చేస్తుంది. దీని వాసనకు దోమలు, పాములు దూరంగా పారి పోతాయి.నిమ్మగడ్డి పొడవాటి ఆకులను కడిగి చిన్నముక్కలుగా కత్తిరించి నీళ్ళల్లో వేసి మరిగించి గోరువెచ్చగా వున్నప్పుడు త్రాగితే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఛాతి లోని కఫాన్ని తగ్గిస్తుంది. అలసిన కండరాలనొప్పి తగ్గిస్తుంది.
గొంతునొప్పి తగ్గుతుంది. కొన్ని ప్రాంతాలలో దీని కషాయాన్ని కీళ్ళనొప్పులు తగ్గడానికి త్రాగుతారు. ఆకలి తగ్గిన వారికి దీని కాషాయం మంచి మందు.నిమ్మ గడ్డి ముక్కలలో నల్లజిలకర కలిపి నీళ్ళల్లో మరిగించి చల్లార్చి త్రాగితే  చెడు కోలేస్ట్రాల్ తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది మనసుకు హాయిని, ఆనందాన్ని కలుగజేస్తుంది.నిమ్మ గడ్డి కాషాయములో తేనె కలిపి త్రాగితే మరింత రుచిగా ఉంటుంది
కామెంట్‌లు