సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు. peddissrgnt@gmail.com

  
ఎంత ఎక్కువగా కష్టపడి .  పని చేస్తామో, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది. మెకంజీ
ఓర్పు గాడిదకున్న అదృష్టం, మీద ఎంత బరువున్నా సహనం పాటిస్తుంది.  లార్డ్ హోన్స్ డోన్
జీవితం ఒక  అవకాశం, దాని నుంచి ప్రయోజనం పొందు. అది ఒక అదృష్టమా, దానిని అందుకో.
తెలివైనవారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్
దైవకృప, అదృష్టం నిన్ను వరించినా గర్వాన్ని మాత్రం నీవు వరించకు. కాళిదాసు
ప్రకృతిలో ప్రతి విషయం సూత్రప్రకారమే జరుగుతుంది, అదృష్టంవల్ల కాదు.  ఎమర్సన్
ప్రగతిని నిర్దేశించేది అదృష్టం కాదు, మనిషి మనసులో కలిగే ఆలోచనల పైననే ప్రగతి సాధ్యం. ధోరో
మన అదృష్టం మన చేతుల్లో, చేతల్లో వుంటుంది, ముఖాన రాసి వుండదు. 
మానవజన్మ ఎత్తడం మహా అదృష్టం.   దాన్ని భగవంతునికే అర్పించు. 
విశ్వాసం అదృష్టం కంటే గొప్పది,  పట్టుదలగల మనిషి అదృష్టం కోసం ఎదురు చూడడు.
వేలాది మిత్రులను కలిగి ఉండటం గొప్పకాదు,  వేల సమస్యలను తీర్చగల మిత్రుడిని కలిగి ఉండడం అదృష్టం.  ఏ సమస్యనూ నీ దరికి రానీయని మిత్రుడిని కలిగి ఉండడం మరీ అదృష్టం.


కామెంట్‌లు