బడికి పోదాం(బాలగేయం):-చైతన్య భారతి పోతుల(తెలుగు అధ్యాపకురాలు)ZPHS.నేరెళ్లపల్లి7013264464
రా తమ్ముడు పోదాం బడికి ఆ..ఆ..ఆ
పిలుస్తోంది రారమ్మని అందరినీ ఓ..ఓ..ఓ.//2//

గుణగణ బడిగంట మోగిందంట
భయబ్రాంతులు లేనేలేవంట
బడిలోని చదువులు బాగుగా
మనకోసం పంతుళ్ళుచెప్తారుగా
ఆటపాటలతో ఆడుతు పాడుతు చదివేద్దాం..//రా తమ్ముడు//

శానిటైజర్ తప్పక రాసుకొనీ
మూతికి మాస్కు పెట్టుకొనీ
ఆన్లైన్ బోధనకు స్వస్తి పలికీ
ప్రత్యక్ష పాఠాలకు స్వాగతం పలికీ
పుస్తకాల సంచితో చకచక  పోదాం బడికి..//రాతమ్ముడు//

పచ్చని ప్రకృతి ఒడిలోనా
ప్రియమైన గురువులతోనా


జ్ఞానం పెంచుకుందామురా
మనభవిత దిద్దుకుందామురా
అజ్ఞానం తొలగి విజ్ఞానం సొంతమౌను కదా..!//రాతమ్ముడు//

మధ్యలో తగు విశ్రాంతీ
భౌతిక దూరాలు కడు శాంతీ
కంటిచూపి పలకరింపులూ
మాస్కు తీస్తే మనకు ముప్పులూ
బరోసానిచ్చే బడులూ రావాలీ అందరూ..//రా తమ్ముడు//

కామెంట్‌లు