*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౧ - 001)

 *శ్రీ పార్థసారధీ! నేఁ* 
*బాపాత్ముఁడ నీదుపాలఁ బడినాడ ననుం*
*గాపాడుమనుచు నాంతర*
*కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా!*
తా.: 
ఓ కృష్ణా!  నేను ఎన్నో పాపాలను చేసిన పాపాత్మడిని.  పాపపు బుద్ధులు వున్న వాడిని.  నన్ను రక్షించ గలిగిన వాడవని నీ దగ్గరకు వచ్చాను.  నా ప్రవర్తన చూచి, నా మీద కోపము తెచ్చుకోకుండా నన్ను కాపాడు స్వామీ  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*అర్జునుని రధసారథి వైన శ్రీ కృష్ణా, ఈ మానవ జన్మ ఎత్తిన నేను నీ మాయలో పడి పాపపు అలోచనలతో వుంటూ, చేయకూడని పనులు చేస్తూ నీ నుండి చాలా దూరం ప్రయాణం చేసాను. ఇది కూడా నీ దయయే కదా, కంసారీ!  దూరంలో వున్న, దూరమైన కొడుకుని కూడా దగ్గరగా తీసుకుని చక్కనైన దారిలో నడిపించే కన్న తండ్రి నువ్వు అని నిక్కముగా నమ్మి వున్నాను, రుక్మిణీ వల్లభా!  నా మీద కన్నెర్ర చేయక, నాకు సద్బుద్ధిని, సన్మార్గాన్ని ఇచ్చి నీ సందికి చేర్చుకో, ప్రహ్లాదవరదా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు