*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౨ - 002)

 కందం:
*నరజన్మ మెత్తి నందున* *సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద*
*చ్చరణములు మరవ కుండిన* *గురు ఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా!*
తా.: 
ఓ మనిషీ, మనిషిగా పట్టావు.  అందుచేత,  విష్ణుమూర్తి ని ఎప్పుడూ గుర్తు వుంచుకుని, ఆయన పాదలు పట్టుకుని వుంటే,  గొప్ప పుణ్యం చేసుకున్నట్టే....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*పరమేశ్వర కృపతో వివేచన చేయగల బుద్ధి కుశలతతో మానవ జన్మ లభించింది.  అలా లభించిన బుద్ధిని పరమాత్మ యందు నిలిపి, ఆ పరాత్పరుని పాదాలు ఆజన్మాంతము వదలకుండా పట్టుకుని వుండగలితే, జన్మ సార్ధకత చెందినట్లే.  ఈ సార్ధకతను పొందాలన్నా, ఆ కరుణామూర్తి కరుణా కటాక్ష వీక్షణాలు మనపైన వుండి వుండ వలసిందే, కదా కారుణ్య ధామా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు