*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౩ - 003)

 కందం:
*ఎంతటి విద్యల నేర్చిన*  *సంతసముగ వస్తుతతులు సంపాదింపన్*
*జింతించి చూడ నన్నియు*
*గొంతుకఁ దడుపుకొను కొరకె గువ్వలచెన్నా!*
తా.: 
ఏ మనిషి ఎన్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా, ఆ చదివిన చదువులతో ఉద్యోగాలు సంపాదించుకున్నా,  ఆ చేసే పని వల్ల డబ్బులు సంపాదించినా, అలా సంపాదించిన డబ్బతో వస్తువులు, ఇలా ఎన్ని కొనుకున్నా,  అలోచించి చూస్తే ఇదంతా కూడా తమ దాహం తీర్చుకోవడానికే కదా, పరమాత్మా  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*దేవాధి దేవా, ఈ చరాచర సృష్టిలో మమ్మల్ని పుట్టించి ఎన్నెన్ని ఆటలు మాచేత ఆడిస్తావయ్యా! నీకు నీవే సాటి. ఈ ప్రపంచంలో మేము ముందుకు ఎదగడానికి పనికి రాని ఎన్నో విద్యలు మా చేత చదివిస్తావు.  మాకు ఎంతో విజ్ఞానం వచ్చేసిందని మేము అనుకుని, ఎవేవో పనికిరాని పనులు చేస్తుంటే, అవి చూస్తూ నీ ఆట బాగా సాగుతోంది అని ఆనంద పడతావు.  ఎన్ని చదివినా,  ఎంత చేసినా, ఏమి సంపాదించినా మా జానెడు పొట్ట నింపుకోవడానికి, ఆపైన వున్న గొంతు తడుపుకోవడానికే గానీ, వేరెందుకు పనికిరావు కదా, చెన్నకేశవస్వామి! మమ్మల్ని ఇలా ఎంత పరీక్షించినా, నీ పరీక్షలో మేము మేముగా నీ సహాయం లేక నెగ్గలేము అని నీకే తెలుసు. అందుకని, మా యందు దయచేసి, మమ్మల్ని అందరినీ నీ వాళ్ళుగా చేసుకుని, నీ దగ్గరగా తీసుకుని మాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించు, పన్నగేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు