*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౪ - 004)
 కందం:
*సారాసారము లెరుఁగని*  *బేరజులకు బుద్ధిజెప్పఁ బెద్దలవశమా?*
*నీరెంత పోసి పెంచినఁ*
*గూరౌనా నేలవేము?గువ్వలచెన్నా!*
తా.: 
ఎట్లాంటి  మనిషికి అయినా మంచి ఏది చెడు ఏది అని తెలుసుకోవడం చాలా అవసరం.  కానీ దుర్మార్గులు, చెడ్డ బుద్ధి కలవారు, మంచి చెడులను తెలుసుకో లేరు.  ఇలా మంచి చెడులను తెలుసుకో లేని చెడ్డవారికి, అవి తెలిసేటట్టుగా చెప్పడం పెద్దవారి వల్ల కూడా కాదు.  ఈ భూమి మీద వున్న వేప చెట్టుకు ఎంతగా నీరు పోసి పెంచినా వేప ఆకు భోజనంలోకి కూర అవలేదు కదా  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పరంధామా, పరాత్పరా నువ్వు పూతన దగ్గర మొదలుపెట్టి చక్రాసురుడు, కంసుడు, బకాసురుడు, ఇలాంటివారిని ఎంత మందినో వారు పయనించే మార్గం లోకహితము కాదని, ఆ దారిని వెళ్ళవద్దని చెప్పి చూచావు. కానీ, వారిని మార్చడం నీ వల్లే కాలేదు.  చివరికి అంతమొందించావు.  మేమా మానవులము, బుద్ధి కుశలత వుండీ లేని వారము.  లేశమంతైనా ఆలస్యం కానీకుండా చెడువైపు ఆకర్షితులమౌతాము. మానవులలో పెద్ద వయసు వారు మమ్మల్ని మా మార్గాన్ని మార్చలేక పోవచ్చు కానీ, నీకు కానిది ఏదైనా వుందా, మురళీ గాన లోల!  మంచి చెడుల తారతమ్యాలు నేర్పి నీ వైపుకు మమ్మల్ని తిప్పకో, మానినీ మానస చోర!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు