*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౫ - 005)

 కందం:
*అడుగునకు మడుఁగు లిడుచును*
*జిడిముడిపా టింతలేక చెప్పినపనులన్*
*వడిఁజేసి నంతమాత్రన*
*కొడుకగునా లంజకొడుకు?గువ్వలచెన్నా!*
తా.: 
మనం అడుగు తీసి అడుగు వేసేటప్పుడు పాదాల కింద బట్టలు పరచేవాడు, అంటే చెప్పిన పనిని చెప్పినట్టు గా చేసే వాడు, అంటే గీసిన గీటు దాటకుండా మన మాటకు విలువ ఇస్తూ  తు చ తప్పకుండా పనులు పూర్తి చేసేవాడు. అంటే ఎవరు తుమ్మినా, ఎవరు చనిపోయిన పని ఆపకుండా చేయడం.  ఇంతగా పనిచేసేవాడు అక్రమ సంతానం కనుక అయితే అసలు సంతోషంగా వుండదు. అదే కట్టుకున్న భార్యతో కన్న కొడుకైతే ఆ ఆనందం ఎంతో ఎక్కువ గా వుంటుంది.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పరంధామా, పార్వతీ పతీ! ఎన్నెన్ని నాటకాలు ఆడిస్తావయా, మాతో.  వక్రమార్గాలలో వచ్చిన సంపాదన ఏవిధంగానూ సంతోషాన్ని కలిగించదు.  కష్టమైనా సక్రమంగా పొందినది ఏదైనా ఆలస్యంగా అయినా కలకాలం మనతో వుండే మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కాకి పిల్లలను తీసుకు వచ్చి కోయిల సాకితే కాకిపిల్లలు కోయిలలు అవలేవు గదా, లక్ష్మీ పతీ!* 
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు