*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౬ - 006)
 కందం:
*ఈవియ్యని పదపద్యము?*
*గోవా చదివించికొనఁగఁ గుంభినిమీదన్*
*ఈవిచ్చిన పదపద్యము*
*గోవా మరిఁజదువుకొనఁగఁ గువ్వలచెన్నా!*
తా.: 
మన గురించి పొగుడుతూ పదము గానీ పద్యము గానీ చెప్పిన వారికి ఏమీ బహుమతి ఇవ్వకుండా వుంటే, ఆ పద్యం చెప్పిన వారకీ బావుండదు, విన్న మనకు అసలు బావుండదు.  అలా కాకుండా,  మనలను మెచ్చే కవిత్వం చెప్పిన వారికి, వారిని గౌరవిస్తూ ఎంతో కొంత బహుమానము ఇస్తే చెప్పే వారు కూడా వారి మనసులో పూర్తిగా మనలను వుంచుకొని పద్యమో, పాటో చెప్తారు. వినడానికి మనకూ బావుంటుంది .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మన గురించి

ఎవరైనా ఆలోచించి మంచి మాటలు చెప్తున్నప్పుడు, వారికి వారు చెప్పే మాటలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి.  పకృతి కూడా మనకు ఎన్నో వసతులు ఇచ్చింది. మరి పకృతికి కూడా మనం కృతజ్ఞతగా వుండాలి. ప్రకృతి అంటే అమ్మ కదా! అమ్మ రుణం తీర్చడం కుదిరే పని కాదు. కానీ, అమ్మకు కృతజ్ఞత పూర్వకంగా మన  వ్యవహారం వుండలి.  శ్రీ కృష్ణుడు కూడా తాను యశోదా మాతకు ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి వకుళమాత వద్దకు వెళ్ళి తన వివాహం జరిపించమని అడిగి, యశోదామాతకు ఇచ్చిన మాట చెల్లించి, మనకు మార్గ దర్శనం చేసాడు.  ఇక్కడ మనం తెలుసుకుని ఆచరించ వలసిన విషయం ఏమిటంటే, మనకు మంచి చేసిన వారిని గాని, మంచి మాట చెప్పిన వారి పట్ల మనం కృతజ్ఞతా పూర్వకంగా వ్యవహరించాలి*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు