*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౦౭ - 007)
 కందం:
*ఇరుగు పొరుగువా రందరుఁ*
 *గరమబ్బురపడుచు నవ్వఁగా వేషములన్*
*మరిమరి మార్చిన దొరలకు*
*గురువగునా? బ్రాహ్మణుండు గువ్వలచెన్నా!*
తా.: 
బ్రాహ్మణుడు అనేవాడు గానీ, వేరే ఎవరైనా గానీ తన ఇంటి చుట్టుపక్కల వున్న వాళ్ళు ఆశ్చర్య పడేవిధంగా వేరు వేరు విధాలుగా వేషాలు మార్చుకుంటూ బ్రతుకు గడుపుతూ వుంటే,  చూడడానికి బావుంటుందేమో గానీ, ఇలా వేరు వేరు వేషాలు వేయడం వల్ల తన చుట్టుపక్కల చులకన అవుతాడు గానీ, ఏమాత్రం గొప్పతనం గా వుండదు. ఎవరికి ఎవరూ గురువులు కూడా కాలేరు. అవ్వరు కూడా.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పరమేశ్వరుని కంటే గొప్ప వేషగాడు ఎవరైనా వున్నారు అని అనుకున్న వారు ఆ పరమేశ్వర మాయలో పీకలలోతు మునిగి వున్నరని అవగతమవుతుంది.  వెర్రి మొర్రి వేషాలు వేసిన శకుని, తనకే అన్నీ తెలుసు అని విర్రవీగిన దుర్యోధనుడు, తనను ఎవరూ నిర్జించలేరు అని కూర్చున్న బకాసురుడు, వీరు ఇంకొందరు ఎవరైనా ఎవరికైనా గురువులు అవగలిగారా. లేదు కదా. మనకు భగవదనుగ్రహంగా వచ్చిన తెలివితేటలు ఏమైనా వుంటే వాటిని నలుగురికి వుపయోగపడే విధంగా వాడితే, నలుగురు మెచ్చుకుంటారు. నాలుగు కాలాలు నిలిచి వుంటారు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు