*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౦ - 010)
 కందం:
*వెలకాంత లెందఁరైనను*  
*గులకాంతకు సాటిరారు కుంభినిలోనన్*
*బలువిద్య లెన్ని నెర్చినఁ*
*గుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా!*
తా.: 
 ఈ భూమి పైన కులవృత్తులు కాకుండా వేరే ఎన్ని చదువులు చదుకున్నా ఆ చదువులు  కులవృత్తుల కంటే గొప్పవి కావు.  ఎలాగంటే,  ఇంటి బయట ఎంత మంది  ఆడవారైనా దొరకవచ్చు. కానీ, మనల్ని పెళ్ళి చేసుకుని మనతో వుండడానికి వచ్చిన  భార్య కంటే ఎక్కవ కాలేరు .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*సర్వ జగద్రక్షకా, మా మనుషులు ఏమి చెప్పినా, ఎంత చెప్పినా, నువ్వే చెప్పినా వినరు కదా, విశ్వ పరిపాలకా!   ఎవరి కులవృత్తులు వారు నేర్చుకోవడం, చేసుకోవడం మానేసారు.  తల్లిదండ్రులు కులవృత్తులు చేసి బిడ్డలను సాకుతుంటే, పిల్లలు మాత్రం వారి వారి కులవృత్తులను పట్టించుకోవడం మానేసారు. ఫలితంగా, మట్టి పాత్రలు పోయాయి.  బట్టలు శుభ్రం చేసి ఇచ్చే చాకలి వారు కనిపించడం లేదు.  ఇంటి సరుకులు అమ్మే వైశ్యులూ కనబడటం లేదు. బ్రాహ్మణుల పుత్రులు బ్రాహ్మణత్వము చేయడం మానేసారు. అందరూ తూర్పు దేశాలవైపు చూడడం మొదలుపెట్టి, వారి లా వుండే ప్రయత్నం లా మొదలుపెట్టి, అలాగే వుండే సాహసం చేస్తూ వారి అస్తిత్వాన్ని పోగొట్టుకుని బతికేస్తున్నారు, జీవశక్తి లేకుండానే.  ఎవరు ఎంత చేసినా సంపాదన అంతా పొట్ట నింపొకోడానికే కదా!  కానీ వారి వారి వృత్తలు అంతం అయిపోతున్నాయి.  మనతో తనజీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్య అనే మనిషి ఇచ్చే భరోసా మరో వ్యక్తి ఎవరూ ఎప్పుడూ ఎన్నటకీ ఇవ్వలేరు కాక ఇవ్వలేరు. ఇది సత్యం. పునః పునః సత్యం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు