*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౧ - 011)
 కందం:
*కలకొలఁది ధర్మముండినఁ* 
*గలిగినసిరి కదలకుండుఁగాసారమునన్*
*గలజలము మడవలేమిని*
*గొలగొల గట్టు తెగిపోదే?గువ్వలచెన్నా!*
తా.: 
 మనం ధర్మాన్ని నమ్ముతూ, ధర్మం చూపించిన దారిలో వెళుతూ వుంటే, మనకు వచ్చిన డబ్బు, మనతో వున్న మనుషులు మనతోనే వుంటాయి.  ఎలా అంటే, ఒక ఊరిలోని చెరువు గట్టులు రెండు వైపులా గట్టిగా వుంటే చెరువులోని నీరు చెరువులోనే వుండి ఊరు మొత్తానికి ఉపయోగ పడుతుంది కదా, అలాగ .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"ధర్మో రక్షతి రక్షితః" -  ధర్మ మార్గంలో వుండడం వల్ల మనకు కలిగే ఆనందంతో మనం అందముగా, ఆనందంగా వుండడంతో పాటు మన చుట్టుపక్కల వున్న వారికి కూడా ఆనందాన్ని పెంచవచ్చు, పంచవచ్చు.  సంకుచితత్వాన్ని వదలి పెట్టి, నలుగురు నా, మన వాళ్ళు అనుకో గలగాలి. అప్పుడు మనం ఇబ్బంది పడకుండా మన జీవికకు వలసిన సంపదలు మన సంకల్పం లేకనే మనకు దొరుకుతాయి. దొరికినవి మనతోనే వుంటాయి. పరమాత్మ పాదసేవ కన్నా వేరే సంపద  లేదు కదా.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు