*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౨ - 012)
 కందం:
*తెలిసియు! దెలియని వానకిఁ*
*దెలుపంగలఁడే? మహోపదేశికుఁడైనన్*
*బలుకంబారనికాయల*
*గొలుపంగలఁడెవఁడు పండ?గువ్వలచెన్నా!*
తా.: 
 పచ్చిగా వుండి, కనీసం పలకబారని కాయలను పండుగా తయారు చేయగలవారు ఎవరైనా వున్నారా.  పచ్చికాయను పండుగా ఎవరూ చెయలేరు కదా.  ఎలాగంటే,  తెలిసీ తెలియని వానికి ఎంత  గొప్ప గురువైనా ఎటువంటి చదువునూ నేర్పలేడు కదా, అలాగ .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఎంతటి పాపాత్మునికైనా, తన పాప కర్మ ఫలించే వరకు అనుభవింపక తప్పదు. ఇది విధి వ్రాత.  మహాశివునికైనా తప్పలేదు కదా! ఆ పరమేశ్వరుడు అయినా శని ప్రభావం నుండి తప్పించుకో గలిగాడా. లేదుకదా.  కర్మ పరిపక్వమైతే తప్ప మోక్ష మార్గము అవగతం అవదు.  ఆ పరిపక్వతను మనకు అనుగ్రహించ గలవాడు, పరాత్పరుడు ఒక్కడే.  
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు