*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౪ - 014)
 కందం:
*అపరిమిత వాహనాదిక*  
*మపూర్వముగ నున్న యల్పుండధికుండగునా?*
*విపులాంబర వాద్యంబులఁ*
*గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా!*
తా.: 
 ఇంటింటికీ తిరిగే గంగిరెద్దు, తన వంటి మీద రకరకాల విలువగల బట్టలును తన వీపు మీద వేసుకుని,  ఎన్నో విధలైన వాద్య వస్తువులను తనచుట్టూ వుంచుకుంటే, గంగిరెద్దు రాజు అవదుకదా! అలాగే,  ఎన్నెన్నో విలువైన వాహనాలు వుంచుకున్న మాత్రాన ఏమాత్రం తెలివిలేని ఒక మనిషి పండితుడు కాలేడు  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మెరమొచ్చు వేషాలు ఎన్ని వేసినా మతిమాలిన వ్యక్తి, తెలివి లేని వ్యక్తి పండితుడిగా చలామణీ అవలేడు.  పాంచభౌతికమైన చిరంతనంగా విలువలేని వస్తువులు, విద్యలు ఎన్ని నేర్చినా కూడా మనిషి మాధవుడు కాలేడు.  అస్త్ర శస్త్రాలు ఎన్ని సంపాదించినా, మంత్రశక్తలు సంపాదించుకున్నా, మానవుడు అనంతుడు అవలేడు.  నలుగురికీ వుపయోగపడుతూ, వారి అందరి మంచీ కోరుకుంటూ, వారి ఎదుగుదల లో తన ఎదుగుదల, మంచి చూచుకో గలిగిన వాడు దేవుడే అవుతాడు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు