*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౯ - 019)
 కందం:
*పురుషుండు తటస్థించిన* *తరుణమునందరుణి గుణముఁ దరుణిదనంతన్*
*దొరికినఁ బురుషునిగుణమును*
*గురుబుద్ధీన్! తెలియవలయు గువ్వలచెన్నా!*
తా.: 
ఇక్కడ అడపిల్లకు మగవాడు ఎదురుపడి పరచయమైతే అప్పుడు ఆ స్త్రీ స్వభావం ఎలావుంటుంది.  అలాగే, ఒక స్త్రీ తనంత తాను గా మగవాని దగ్గరకు వస్తే అప్పుడు ఆ స్త్రీ స్వభావ పరిస్థితి ఎలా వుంటుంది అని అర్థం చేసుకోవలసిన అవసరం తెలివైన ప్రతీ మగవాని బాధ్యత గా తెలుసుకోవాలి ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*శూర్పణఖ రామునికి ఎదురుగా వచ్చినప్పుడు రాముడు ప్రవర్తించిన తీరు, ఆపిదప లక్ష్మణుని హావ భావ ప్రకటన అందరకూ ఆనుసరణీయం.  కీచకునికి ద్రౌపది పై మనసు కలిగినప్పుడు, ఆ పాంచాలి తన మర్యాద కాపాడుకుంటూ, వంశ మర్యాద కాపాడిన తీరు, అభినందనీయం మరియు అనుసరణీయం.  ఎటువంటి పరిస్థితులలో అయినా, ఆకర్షణ కనపడగానే మనసు పారేసుకునే అలవాటు చాలా దుఃఖ పరిస్థితులకు దారి వేస్తుంది. ఆకర్షణకు తల ఒగ్గితే విచక్షణ కోల్పోవడం సహజంగా జరిగే విషయం.  కాబట్టి, ఏ ఆకర్షణకూ లోను కాకుండా, పరమాత్మ పై మనసు లగ్నం చేసి, ఆత్మ తృప్తి సంపాదించుకోవాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు