సూక్తులు;-ఆత్మ – 1. - సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 @ ఆత్మకు పునాది శాశ్వతం, అశాశ్వతం కాదు, దానికి ఉనికి లేదు.
@ ఆత్మ అనే నదీప్రవాహాన్ని శోధించు, నీ పరిణామక్రమం గురించి ఆలోచించు.
@ ఆత్మ వున్నా నువ్వు దానిని చూడలేవు, కనుగొనలేవు. 
@ ఆత్మగౌరవం కాపాడుకోవడమే అహంకారమైతే దానిని వ్యతిరేకించేది దురహంకారం. 
@ ఆత్మజ్ఞానమే అన్నిటినీ తలదన్నే అసలైన జ్ఞానం. వ్యాసుడు
@ ఆత్మత్యాగం ద్వారా ప్రత్యర్థిని ఒప్పించడమే సత్యాగ్రహం.
@ ఆత్మనిగ్రహం విజయానికి తొలిమెట్టు. 
@ ఆత్మ నిష్కళంకమైనది.
@ ఆత్మ ప్రత్యేకంగా లేదు.మనిషి మానసిక ప్రవృత్తినే ఆత్మ అంటాం. మానసికప్రవృత్తి దేహప్రవృత్తిపై ఆధారపడి వుంటుంది. రావిపూడి వెంకటాద్రి
@ ఆత్మబలంపై విశ్వాసముంటే విజయాలు సాధిస్తూ ముందుకు పోవచ్చు.ఆ విశ్వాసమే వారికి ధైర్యాన్నిచ్చి అద్భుత కార్యాలు చేయిస్తుంది.
@ ఆత్మ రథారూఢుడైన యజమాని అని  తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనసు కళ్ళెము అని గ్రహించు. కఠోపనిషత్
@ ఆత్మ విశ్వాసం అనే మౌలికాంశం చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతుంది.
@ ఆత్మ విశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. 
@ ఆత్మ విశ్వాసం ఉన్నవారు బలవంతులు. సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. 
@ ఆత్మ విశ్వాసం సడలితే ఓటమి  ప్రారంభమైనట్లే.  అది సడలకుండా ఉన్నప్పుడే  మనల్ని విజయం వరిస్తుంది. అబ్దుల్ కలాం

కామెంట్‌లు