ఆనందం- 1. ... సూక్తులు- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com

 @ ఆత్మీయులతో పంచుకుంటే బాధ సగమవుతుంది.  ఆనందం రెట్టింపవుతుంది.
@ ఆనందం ఆచరణలో ప్రతి దశలోనూ ఉంటుంది, అంతిమ దశలో మాత్రమే కాదు.
@ ఆనందం ఉంటే అన్నీ బాగుంటాయని కాదు, బాగాలేని వాటికి అతీతంగా చూస్తున్ననావని అర్థం.
@ ఆనందం ఒక యాత్ర వంటిది, సకారాత్మకంగా ఆలోచిస్తే నువ్వు ఆనందంగా ఉంటే నీ ఆనందం చుట్టుపక్కల అందరికీ వ్యాపిస్తుంది. 
@ ఆనందం కలిగితే ఇది నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకోని వారికి కష్టం కలిగినపుడు ఇది నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకునే హక్కు ఉండదు.
@ ఆనందం ప్రశ్నలు అడిగే వారితో,వాటిని ప్రేమించేవారితో, ప్రశ్నలతో/ప్రశ్నలచేత  జీవించేవారితో  ఉంటుంది.  
@ ఆలోచనల తీరును బట్టి మనకు ఆనందం లభిస్తుంది.   ఎమర్సన్
@ ఇంద్రియాలకు, మనసుకు ఆనందం కలిగించటమే ఐశ్వర్యమున్నందుకు ప్రయోజనం. 
@ ఇతరులతో పంచుకున్నప్పుడే ఆనందం విలువ, పరిమాణం పెరుగుతాయి. మార్క్ ట్వెయిన్
@ ఆనందం, సుఖం, సంతోషం ఇవ్వడం లోనే ఉన్నాయి.
@ ఊరికే సేవచేయటం చాలదు. చేసిన సేవద్వారా ఆనందం పొందగలగాలి. సమాజం కోసం, ఆత్మానందానికి సేవ చేయాలి. గాంధీజీ
@ ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం వుంటాయి. 
@ ఎవరి పిచ్చి వారికి ఆనందం.
@ ఒక ఆనందం వంద దుఃఖాలను చెల్లాచెదరు చేస్తుంది.
@ ఒకరికొకరు పంచుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంది.

కామెంట్‌లు