ముత్యాల హారాలు -- విస్లావత్ సావిత్రి,10వ తరగతి.జడ్.పి.హెచ్.ఎస్ నేరళ్ల పల్లి ఉన్నత పాఠశాల.7013264644

 14.
ముత్యాల హారాలు రాయ్.
మంచి పేరును పొందోయ్.
జ్ఞాపక  శక్తి పెంచుకోయ్.
కవయిత్రిలుగా కావొయ్.
15.
చెట్లున్న పుడమి చూడా!
మానవ ప్రగతికి మేడా!
మనకు లేదు నిలువ నీడా!
నాటండి అవని నిండా!
16.
 కలం పట్టి రాయాలోయ్!
 సమస్యలు చూపాలోయ్!
 సమాజాన్ని మార్చాలోయ్!
  పేరును పొందాలోయ్!
17.
పచ్చని చెట్లు నాటుదాం! 
కాలుష్యo పోగొడదాం!
ప్లాస్టిక్ను మానుదాం!
సమాజ హితo కోరుదాం!
18.
పొద్దున్నే మేల్కొనుము.
యోగాసనాలు చేయుము.
పోషకాహారం తినుము.
మానసికంగా ఉండుము.
19.
మహనీయుల బాటను,
జీవితానికి విలువను,
గుర్తించి పొందినను,
మంచి స్థాయికి నీవును.
20.
చెట్లను పెంచుదాం రా.
పండ్లు ఫలాలు తిను రా.
ఆక్సిజన్ అందుకోరా.
చెట్టును నరకొద్దురా.
21.
 నీ పుట్టిన రోజున రా.
 మంచి మొక్కను నాటు రా.
 దావత్ చేయకురా.
 జీవితం ధన్యం రా
22.
 పచ్చని పంట పొలాలు.
 కిలకిలమను పక్షులు.
 గలగలపారు నదులు.
 అందమైన పల్లెలు.
23.
 మహనీయుల మాటలు.
 మంచి ముత్యాల సూక్తులు.
 నిర్లక్ష్యాన్ని వదులు.
భవిత ఇచ్చు వెలుగులు.
24.
 సత్యంగా పలుకుదాం.
 అహింసగా ఉందాం.
 శాంతియుతంగ గడుపుదాం.
 ధర్మoగా సాగుదాం.
25.
స్త్రీలను గౌరవించు రా!
చిన్నచూపు చూడకు రా !
దేవతతొ సమానం రా!
ఆడపిల్ల శక్తిరా!
26.
అందమైన పిల్లలు.
దేవుని ప్రతిరూపాలు.
అమ్మా నాన్న కలలు.
ఆడిపాడే వయస్సులు.
27.
ఆడపిల్ల చదువు రా.
అందరికి వెలుగు రా.
బతుకే మారునురా.
కొత్త దారి చూపురా.
28.
 అమ్మ ప్రేమిస్తుంది రా.
 నాన్న ధైర్యం ఇస్తాడు రా.
 తోబుట్టువుల తోడురా.
 ఎప్పటికి ఉండాలిరా.
29.
 దానము నీవు చేయుము.
 ఉన్న దాంట్లో కొంచెము.
 బీదలకే పంచుము.
 సంతృప్తిని పొందుము.

కామెంట్‌లు