"ముత్యాల హారాలు";-నేనవత్ మౌనిక--10వ తరగతిZPHS నేరెళ్ల పల్లిమండల్ బాలానగర్జిల్లా మహబూబ్ నగర్7013264644

 14.
రోగాలతో ఉండకుము.
ఆరోగ్యంగా ఉండుము.
చేత కాదని అనకుము.
పట్టుతో సాధించుము.
15.
ఉన్న జన్మ అదృష్టము.
హాయిగాను గడుపుము.
ద్వేషాన్ని వదిలేయుము.
జీవితాన్ని సాగించుము.
16.
ఎవ్వరూ లేరనీ,
ఉన్నది ఒక్కరమనీ,
జీవితం గమ్యమనీ,
నేర్వు మన పాఠమనీ.
17.
అందాన్ని చూడకుము.
బంధాలను చూడుము.
చెడును వదిలిపెట్టుము.
మంచిని ప్రదర్శించుము.
18.
చెడ్డవైన పనులనూ,
చిలిపి తనపు చేష్టలనూ,
చెడు అర్థపు మాటలనూ,
వదిలి సాగవలయునూ.
19.
తల్లిదండ్రుల బంధము,
జన్మ జన్మల బంధము.
మన ఈ అనుబంధము,
ప్రేమకు ప్రతిరూపము.
20.
కిలకిలమంటూ పక్షులు,
గలగలమంటూ గాజులు,
నవ్వించే స్నేహితులు,
కలగలిసిన పల్లెటూరు.
21.
మంచిని చదివేవాడు,
చెడు జోలికే పోడు.
జ్ఞానాన్ని పొందేవాడు,
లోకాన్ని చదువుతాడు.
22.
హాయిగా ఉండువాడు,
సుఖాన్ని చూసేవాడు,
కష్టం తెలిసినవాడు,
నవ్వుతు సాగిపోతాడు.
23.
మొక్కలను పెంచుదాం!
ప్రకృతిని కాపాడుదాం!
నలుగురికి సాయపడుదాం!
సుఖంగానూ ఉందాం!
24.
గురువును ఆచరిద్దాము!
మంచి దారిలో నడుద్దాము!
గమ్యం చేరుకుందాము!
కష్టమె నమ్ముకుందాము!
25.
ఉన్నవాడికి  అరగదు.
లేనివాడికి దొరకదు.
సమాజం ఇలా కలదు.
అనుకుంటే మార్పాగదు.
26.
స్వార్ధాన్ని వదులుమూ!
చెడు పనులు మానుమూ!
శాంతాన్ని విడువకుమూ!
ఫలితాన్ని ఆశించుమూ!


కామెంట్‌లు