"ముత్యాల హారాలు"--విస్లావత్ శైలజ--10 వ తరగతి-జడ్పీహెచ్ఎస్ నేరెళ్ల పల్లి-బాలానగర్ మండలం-మహబూబ్ నగర్ జిల్లా

 101
డబ్బుకు ఆశపడకు.
దుర్మార్గుల వైపు పోకు.
దురదృష్టవంతుడవకు.
బాధలకు గురి కాకు.
102
పచ్చ పచ్చని పొలాలు.
తినడానికి మొలకలు.
వస్తున్నాయి గింజలు.
తింటాము ధాన్యాలు.
103
గాంధీజీ బాటలు.
వివేకనంద మాటలు.
అబ్దుల్ కలాం నీతులు.
అవే మనకు బాటలు.
104.
అనాథల ఆశ్రమాలు.
ఎందరికో ఆశలు.
అన్నం పెట్టు నిలయాలు
ఆపన్న హస్థాలు.
105
జంకు ఫుడ్లు తినవద్దు.
మన ఆహారం ముద్దు.
అనారోగ్యం వద్దు.
ఆరోగ్యాలు ముద్దు.
106
కొట్లాటలు మానుకో.
కుతంత్రాలు మానుకో.
కసురుకొనుట మానుకో
సంతోషమే కోరుకో.
107
బంజార ప్రజల వారు.
బంగారం లాంటి వారు.
నిజాలు మాట్లాడుతారు.
న్యాయాలు కోరుతారు.
108
దసరా మన పండుగా.
సంబరాలు నిండుగా.
బంధువులతో ఉండగా.
ఆనందం పొందగా.

కామెంట్‌లు