*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౩ - 113)

 మత్తేభము:
*నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే | నీనంచు మీదెత్తితిన్*
*చేకొంటిన్ బిరుదంబు, కంకణము ముం | జేగట్టితిం, బట్టితిన్*
*లోకుల్ మెచ్చవ్రతంబు, నాతనువు కీ | డుల్ నేర్పులుంగావు, ఛీ*
*ఛీ! కాలంబురీతి దప్పెడుజుమీ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
నీ కోసం తప్ప వేరే ఎవ్వరి కోసము కవిత కానీ, పద్యం కానీ రాయను అని ముడుపు కట్టాను.  చేతికి కంకణము వేసుకున్నాను. మంచి మంచి బిరుదులు ఇచ్చారు.  నా చుట్టూ వున్న వారు అందరూ మెచ్చుకునే టట్టు నీ మీద మంచి మంచి కవితలు రాశాను. కానీ, ఈ లోకములో రోజులు అన్నీ ఒకలాగే గడవవు కదా.  నేను పాటించే పద్దతులను ఇక మీదట పాటించగలనో లేదో ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నేను నీకు నచ్చే, నీవు మెచ్చే నిన్న గురించి మాత్రమే కవిత్వం చెపుతానని మీది కట్టాను. ఆవిధంగానే ఇంతకాలమూ నీ భక్తి సామ్రాజ్యంలో కవితలు అల్లి బ్రతుకు వెళ్ళదీసాను.  కానీ, ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితులలో, నా నియమాలు ఉల్లగ్ఘించవలసి వస్తుందేమో అని అనుమానం నన్ను దహించి వేస్తోంది.  అయినా, నీ అండా దండా వుండి, నువ్వు చేదోడుగా వుంటే ఏకాలం నన్ను ఏమి చేస్తుంది.  నీ కరుణా కటాక్ష దృక్కులే నాకు శరణు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు