*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౪ - 114)

 శార్దూలము:
*నిచ్చల్  నిన్ను భజించి చిన్మయ మహా | నిర్వాణపీఠంబుపై*
*రచ్చల్సేయక, యార్జవంబు కుజన | వ్రాతంబుచేగ్రాగి, భూ*
*భృచ్చండాలురగొల్చి, వారు దనుగో | పింపన్, బుధుం డార్తుడై*
*చిచ్షారంజమురెల్ల జల్లుకొనునో | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
ప్రతి రోజు నిన్ను పూజించి, చక్కని ఆనందాన్ని పొందలేక, చెడ్డ దారిలో వున్న వారితో స్నేహం చేస్తూ, రాజులను చేరి వారికి సేవ చేస్తూ బ్రతికేద్దాము అనుకుంటారు.  కానీ  ఆ రాజులు, తన స్నేహితులు అనుకున్నవారు తమని నిందించి, ఇబ్బంది పెడుతుంటే కోపము వచ్చి వళ్ళు మండుతుంటే ఆ మంటను చల్లార్చు కోడానికి నూనె రాసుకుంటే తగ్గదు కదా. ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*"చక్కని రాజ మార్గము వుండగా, సందుల దూరగ నేల" త్యాగరాజస్వామి అన్నటు, అన్ని సుఖాలు, తీర్ధాల పుణ్యాలు, వ్రతాల ఫలితాలు, ఉపవాసాల శ్రేయస్సులు ఇవ్వడానికి నువ్వు మా ప్రక్కనే వున్నావు అన్న ఒక్క నిజం చాలుగదా, వ్యుప్తకేశా!  "ప్రక్కాల నిలబడి, కొలిచే ముచ్చట, బాగా తెలియరాదా" అని ఆ ఆనందాన్ని అనుభవిచ గలిగితే, ఉపయోగ పడని స్నేహితుల వెంట, పనికిరాని 'తరాజులైన' రాజుల వెంట పరుగులెత్తముగా, కాశీవిశ్వేశ్వరా! *
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు