మహాత్మాగాంధీజీగారి152వజయంతి - లాల్ బహదూర్ శాస్త్రీజీగారి117వజయంతి-పద్యాంజలి"!!! : -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
జాతిపితా!గాంధీజీ!
జాతికిస్వేచ్ఛా,విముక్తి,సద్గతినొసగెన్
నీతిగభారతమాతకు
ఖ్యాతినియందించితానుఘనతనుపొందెన్!!!

02.
కం.
దండమయా!బాపూజీ !
దండమయా!సత్యశీలిదండమునీకున్!
దండమయా!కరుణాత్ముడ!
దండమయా!శాంతసుగుణదండమునెపుడున్!!!

03.
కం.
బాపూజీ!గాంధీజీ!
బాపూజీ!శాంతికోరి బాటలువేసెన్
బాపూజీ!వెలిగించిన
దీపపుకాంతులనడుమనదేశమువెల్గున్!!!

04.
తే.గీ.
బాపుమాటలేవేదాలబాటలయ్యె
బాపుమాటలేస్వాతంత్ర్యబాటలయ్యె
బాపుమాటలేబంగారుబాటలయ్యె
బాపునేగన్న"భారతి"భాగ్యురాలు!!!

05.
కం.
లాలుబహదూరుశాస్త్రీ!
మేలిమిబంగారమతడుమేధావిభువిన్
జాలిహృదయాంతరంగుడు!
పాలనయందించినిండుప్రగతినికోరెన్!!!

06.
కం.
పేదలపక్షమునుండియు
పేదగజీవించెనునిరుపేదగతానున్
వేదనలెన్నియొపడినను
మోదముతోసేవజేసిపులకించెనుగా!!!

07.
కం.
నీతినిజాయితితోడను
నేతగపరిపాలనంబునిష్ఠగజేసెన్
జాతినిజాగృతపరిచియు
ప్రీతిగలాలుబహదూరువిజయమునొందెన్!!!

08.
కం.
విలువలతోసతతంబును
విలువలతోదేశమేలివెలిగెనుశాస్త్రీ
విలువలుమూలంబనియని
విలువలుచేజారకుండవిధులనుసలిపెన్!!!

09.
తే.గీ.
లాలుబహదూరుశాస్త్రిసులక్షణముగ
భరతదేశమ్ముపాలించిప్రాభవముగ
"జైజవాన్ జైకిసాననిజన్మభూమి"
కినినినాదమ్మునొసగినవినయశీలి!!!కామెంట్‌లు