సూక్తులుఆత్మ – 2. - సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 @ ఆత్మవిశ్వాసంతో పనిచేసే మనిషి అందుకో లేని విజయాలుండవు.  సోక్రటీస్
@ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదలకు
@ ఆత్మ విస్మృతియే అధర్మం; ఆత్మ సాక్షాత్కారమే ధర్మం.
@ ఆత్మశక్తిని బహిర్గతం చేయండి.
@ ఆత్మ సమర్పణ కావించనిదే ఏ మంచి పనీ పూర్తికాదు.
@ ఆత్మ అజ్ఞాతంగా పూజించే దైవాలకన్నా చాలా గొప్పది.  నా శిష్యులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా చాలా గొప్పవారు. శివదయాల్
@ ఆత్మ సౌందర్యం గలవారు బాహ్య అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వరు.
@ ఆత్మ, మనసుల సమ్మేళనమే సంకల్పశక్తి. వివేకానంద
@ ఆత్మకు ఆత్మయే ప్రభువు.  అన్యుడెవ్వడు ప్రభువు కాగలడు?  ఆత్మ ద్వారానే వ్యక్తి దుర్లభ ప్రభువును పొందుతున్నాడు. మహాకాలుడు
@ ఆత్మవిస్మృతియే అధర్మం; ఆత్మ సాక్షాత్కారమే ధర్మం. 
@ ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్య ఆత్మ నివసిస్తుంది.
@ ఆసక్తి, దృఢ సంకల్పం లేనివారికి ఎంత ప్రయత్నించినా ఆత్మ తత్వం బోధపడదు. రామాయణం.
@ ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే, ఆత్మ విజయం పొందటమే అత్యుత్తమం
@ ఇంద్రియాలు, మనసూ భోగ్య వస్తువులు, భోగాలకు స్థానం శరీరం – ఇవి ఆత్మ రమించే స్థానాలు.
@ ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్న వివేకం లేకపోవడం బంధానికి హేతువు.

కామెంట్‌లు