సూక్తులు- ఆలోచన.2- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com
 @ఆలోచనలను బట్టే మనం చేపట్టే పనులు ఉంటాయి ఆరవిందయోగి
@ఆలోచనలు క్రమంగా ఒక పుష్పంలాగా వికసించాలి. 
@ఆలోచనలు పుట్టడానికి ప్రసవశాలలు గ్రంథాలయాలు.  అక్కడ చరిత్ర పుట్టి పురుడు పోసుకుంటుంది.  నార్మన్ కజిన్స్
@ఆలోచనలు బలహీనంగా ఉంటే ఓటమి తప్పదు.
@ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి.  మార్కస్ అరిలియస్
@ఆలోచనా  విధానం గంగాప్రవాహం వలె నిర్మలంగా, పవిత్రంగా వుండాలి.
@ఆలోచనాదిశ మార్చుకోగలిగితే జీవితదశకూడా మారుతుంది. బిల్ గేట్స్
@ఆలోచించడం తేలికే, కార్యాచరణే కష్టం.  ఆలోచనల్ని కార్యాచరణలో పెట్టడం మరింత కష్టం. గథే  
@ఆవేశం ఆకాశమంత,  ఆలోచన ఆవగింజంత.
@ఆశావాది కాగలిగిన మనిషి తన జీవితకాలంలో ఎన్నో కలలను పండించుకుని మరెన్నో ఆలోచనలకి ప్రాణంపోసి అద్భుతాలను సాధించగలుగుతాడు.  యజుర్వేదం 
@ఆహారం శరీరానికి ఎంత అవసరమో మనసుకు ఆలోచన అంత అవసరం.సిసిరో
@ఉత్తమ వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ వృధాకావు.
@ఉప్పులేని ఆలోచనలు శత్రువు కన్న ప్రమాదకరం. బుద్ధుడు
@ఎక్కువగా ఆలోచించే వాడు, ఉన్నత అనుభూతులు పొందుతాడు. ఉత్తమంగా పని చేసేవాడు ఎక్కువగా జీవిస్తాడు. 
@ఎవరి మనసు వున్నతమైనదో, ఎవరి ఆలోచన ప్రపంచ ప్రజలందరి బుద్ధిని జ్ఞానసంపన్నం కావిస్తుందో అతడే నిజమైన భాగ్యవంతుడు. 
@ ఏ వ్యక్తి పవిత్ర ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెంటనే వుంటుంది.

కామెంట్‌లు