డా.అడిగొప్పుల సదయ్యకు లీడ్ ఇండియా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2021


  మాజీ రాష్ట్రపతి భారతరత్న డా.ఎపిజె అబ్దుల్ కలాం గారి 90 వ జయంతిని పురస్కరించుకుని ఇటీవల  "లీడ్ ఇండియా ఫౌండేషన్" తెలంగాణరాష్ట్రంలోని పదిహేను మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను "జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2021" కు ఎంపికచేసింది.జమ్మికుంట మండలం జి.ప.ఉ.పా.వావిలాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీ అడిగొప్పుల సదయ్య ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును తేది: 18-10-2021న  హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర విద్యాశాఖమంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారల చేతులమీదుగా రవీంద్రభారతి,హైదరాబాదులో అందుకున్నారు.లీడ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ డా.NB సుదర్శన్ ఆచార్య అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ జాతీయస్థాయి కార్యక్రమంలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి,రాష్ట్రమంత్రులు శ్రీమతి సబితాఇంద్రారెడ్డి,శ్రీమతి సత్యవతి రాథోడ్,ప్రభుత్వ సలహాదారు శ్రీ కె వి రమణాచారి, లీడ్ ఇండియా బ్రాండ్ అంబాసిడార్ శ్రీ డా.పుల్లెల గోపీచంద్ మున్నగు ప్రముఖులు పాల్గొన్నారు.స్కౌటు విభాగంలో "భారతరత్న డా.ఎపిజె అబ్దుల్ కలాం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2021" అందుకున్న శ్రీ సదయ్యను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి డా.వరలక్ష్మి మంచాల గారు,రాష్ట్ర శిక్షణా కమీషనర్ శ్రీ పరమేశ్వర్ గారు,జిల్లా స్కౌటు ఉద్యమకర్త శ్రీ భగవంతరావుగారు,వావిలాల గ్రామ సర్పంచ్ శ్రీమతి జక్కెన శ్రీలత,MPTC శ్రీ మర్రి మల్లేశం,SMC చైర్పర్సన్ శ్రీమతి మామిడి శ్రీలత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కే పి నరేందర్ రావు, ఉపాధ్యాయులు అభినందించారు.


కామెంట్‌లు