విజ్ఞానం -3సేకరణ- పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 @వాయువు, నీరు, వెలుగువలె విజ్ఞానం అందరికి అందితేనే గ్రంథాలయ ఉద్యమఆశయం నెరవేరుతుంది . చిలకమర్తి లక్ష్మీనరసింహం
@విజ్ఞానం  నరసంచారంలేని ఎడారిలో కనిపించే ఆప్తమిత్రుని వంటిది.
@విజ్ఞానం అతిశక్తివంత దృష్టివంటిది. భాగవతం
@విజ్ఞానం స్వర్గానికి ఎగిరే రెక్క. షేక్స్ పియర్
@విజ్ఞానం సముద్రం.అందులో ముత్యపురాశులు కొల్లలు. వాటినితీసుకురాగల ప్రతిభావంతులు  వుండొచ్చు. కానీ, నేను మాత్రం ఆ సముద్రపు ఒడ్డున  గుళకరాళ్ళను ఏరే పసివాడిని. న్యూటన్
@విజ్ఞానమూ,  విశ్వాసమూ ఒకే బుర్రలో యిమడవు.  వాటి సంయోగం వల్ల జన్మించిన సంకర సంతానమే జ్యోతిషం, ఆ సంకరంలో విజ్ఞానం మృగ్యమైంది, విశ్వాసం విపులమైంది. 
@విజ్ఞానమే ఆరోగ్యప్రదం. అదొక్కటే మానసికంగా బలవంతుడిని చెయ్యగలదు, నిజాయితీపరుణ్ని, బుద్ధిమంతుణ్ణి చేయగలదు. గోర్కీ
@విజ్ఞానవికాసం ఎన్నో సదుపాయాలు సమకూర్చింది, యుద్ధభీభత్సాన్ని కూడా అనేక రెట్లు పెంచింది. 
@విజ్ఞానానికి మూలధారం పుస్తకాలు.   విజ్ఞానం మాత్రమే అంతిమంగా పైచేయి సాధించగలదు.గోర్కీ
@విజ్ఞానం ద్వారానే బల తాత్వికత, నిజాయితీ, బుద్ధికుశలత లబిస్తాయి.మనిషిపట్ల హృదయపూర్వక ప్రేమ, శ్రమ పట్ల గౌరవం ఏర్పడతాయి. గోర్కీ
@విజ్ఞానాన్ని సంపాదించేవాడు ధన్యుడు.   బంగారం సంపాదన కంటే విజ్ఞాన సంపాదన మేలు. బైబిల్
@వ్యక్తికి తెలివి ఇవ్వలేని కొండంత విజ్ఞానం తలబిరుసువాడిగా, నిరర్ధకుడిగా చేస్తుంది.  ఆడిసన్ జోసఫ్
@ శీలరహిత విజ్ఞానం అపకారం కలిగించే శక్తి మాత్రమే. 

కామెంట్‌లు