ఆనందం- 3. ... సూక్తులు- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com

 @ పునర్జన్మ శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే కర్మ ఫలితాల నుంచి విముక్తి పొందుతాం. భక్తవేదాంత స్వామి
@ భౌతిక ఆనందం ప్రధానంగా మన ఆలోచనలతో నిర్దేశింపబడింది.   డాక్టర్ రైలీ
@ మంచి ఆలోచనలతో మాట్లాడే/ పనిచేసే వ్యక్తికి ఎప్పుడూ ఆనందం వెంటనే వుంటుంది. బుద్ధుడు
@ మంచి పనులు చేసే వారి వెంటే ఆనందం వుంటుంది.
@ మంచి మార్గంలో పయనించే వారికి ఆనందం వెన్నంటే ఉంటుంది.
@ మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది. ఎమర్సన్
@ మహత్తరమైనదిగా భావించిన మహదాశయ సాధనకై  కృషి చేయటమే జీవితంలో చెప్పుకోదగ్గ ఆనందం.
@ మనిషి భౌతిక,మానసిక బంధాల నుండి బయటపడితే స్వేచ్ఛ, ఆనందం, మానసిక శాంతిని పొందుతాడు.
@ మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్లు మీకు ఆనందం పంచుతారు. బుద్ధుడు
@ ఆనందం, స్వేచ్ఛ, మనఃశాంతిలకై పరితపిస్తుంటాం.. ఇంకొకరికి ఇవ్వటం ద్వారా ఇవి మనకు లభిస్తాయి.
@ సేవకు మించిన ఆనందం, సంతోషాన్ని మించిన  సంపద లేవు.  శంకరాచార్య
@ స్వేచ్ఛ పొందినపుడు ఆనందం పొందగలం. అదే శాశ్వతానంద స్థితి, ప్రశాంత స్థితి, నిర్వాణ సుఖం. 
 

కామెంట్‌లు