మాయటోపి...ఆశ్రిత మువ్వ 4వ తరగతి విద్యారణ్య హైస్కూల్ హైదరాబాద్

 రామాపురం రాజు చాలా మంచాడు.కానీ అతని కొడుకు చెడ్డ వాడు.ఆరాజు దగ్గర ఒక మాయాటోపి ఉండేది. దాని మాయరాజుకి కూడా తెలీదు. అది పాతది బాగా  పడిపోయింది. ఆఊరిలోనే ఒక పేదవాడు ఉన్నాడు.ఆరాజు టోపీ పాడైందని పడేశాడు. ఆ మాయాటోపి పేదవాడికి దొరికింది. వాడు దానిని నెత్తిపై పెట్టుకోగానే అతని తలపై ఏదో బరువు గా అనిపించింది. ఆటోపీ తీయగానే తలమీద బంగారు నాణెం  ఉంది. ఆవిధంగా  అతను  దానిని అమ్మి డబ్బు  సంపాదించాడు. ఈవిషయం చెడ్డవాడైన రాజు కొడుకు కి తెలిసింది. వాడు వచ్చి ఆటోపి లాక్కుని తీసుకుని పోతాడు. ఆటోపీని నెత్తిపై పెట్టుకుంటాడు.తలలో పేలు కుప్పలుగా వచ్చాయి.వాడి బుర్ర బాగా దురద పెడుతుంది.  బాగా  గోకుతాడు.జుట్టు అంతా ఊడిపోతుంది.
నీతి:స్వార్ధంగా ఉండకూడదు.
కామెంట్‌లు