సూక్తులు- ఆలోచన.5- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com
 @ నీ ఆలోచనల్లో కుట్రబుద్ది, దివాలాకోరుతనం ఉండరాదు, దీక్షా తత్పరత ఉండాలి. నీ ఆలోచనల ప్రకారం నడుచుకో.  విజయం తధ్యం. రామకృష్ణ పరమహంస
@ పనిలో విజయం సాధించాలంటే  మరో ఆలోచన లేకుండా నీ మనస్సంతటినీ లక్ష్యసాధనవైపు పెట్టాల్సిందే. అబ్దుల్ కలాం
@ తీసుకునే ఆహారాన్నిబట్టే నీ మనసు, ఆలోచనలు, ఆరోగ్యం. 
@ నే నెవరు అన్న ఆలోచన మనలను భగవంతుని చేరుస్తుంది.
@ నేను,  అనే దానికి మూలం ఆలోచనా చలనం. ఆలోచన అంతం కావడమే జీవిస్తుండగా సంభవించే ఒక రకమైన మరణం. రాహుల
@ పక్కన నుంచొని ఫిర్యాదులు చేస్తుంటే ప్రగతి రాదు, ఆలోచనలను ఆచరణలుగా మారిస్తే వస్తుంది.
@ పవిత్రఆలోచనలతో మాట్లాడి, పనిచేసిన వ్యక్తిని విడువని నీడలాగా ఆనందం వెంట వుంటుంది. 
@ ప్రగతిని నిర్దేశించేది అదృష్టం అనుకోవటం అందమైన భ్రమ.  నిజానికి మనిషి మనసులో కలిగే ఆలోచనల పైననే ప్రగతి సాధ్యపడుతుంది.  ధోరో
@ ప్రతి ఆలోచనలో, ప్రతి పనిలో ఉన్నతంగా ఉండు.   లాంగ్ ఫెలో
@ ప్రతి తీవ్ర సమస్యకు కష్టంలోనే పరిష్కారమార్గం కూడా ఉంటుంది. దాన్ని కనుక్కోవాలంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.
@ ప్రతికూల ఆలోచనలే శత్రువు కన్నా ఎక్కువ కీడు చేస్తాయి. బుద్ధుడు
@ ప్రతిభావంతుల ఆలోచనల్లో పోలికలు ఉంటాయి.   ఆధ్యాత్మ రామాయణం
@ బలహీనులం అనే మాటను ఆలోచనల్లోకే రానీయకండి, ఆత్మవిశ్వాసాన్ని మించిన బలం ఇంకేం ఉంటుంది. ఫ్రాంక్లిన్
@ చేసే పాపకార్యాలను ఎవరూ చూడనప్పుడు చేస్తుంటాం.కాని భగవంతుడు చూస్తూనే ఉన్నాడని, మన పనులనే గాక, ఆలోచనలను గూడా చూస్తున్నాడనే సత్యాన్ని గ్రహించినప్పుడే పాపాల నుండి విముక్తులం అవుతాం. 
@ భౌతిక ఆనందం ప్రధానంగా మన ఆలోచనలతో నిర్దేశింపబడింది.   డాక్టర్ రైలీ
@ మంచి ఆలోచన ఎప్పుడూ వృధా కాదు.
@ మంచి ఆలోచన ఒక రాజ్యానికి రాజు లాంటిది. సెనెకా

కామెంట్‌లు