సూక్తులు- ఆలోచన.6- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com
 @ మంచి ఆలోచనలతో మాట్లాడే/పనిచేసే వ్యక్తికి ఎప్పుడూ ఆనందం వెంటనే వుంటుంది. బుద్దుడు
@ మంచి ఆలోచనలు అందరికీ వస్తుంటాయి. వాటికి కార్యరూపం ఇచ్చే వాళ్లే అరుదు. 
@ మంచి ఆలోచనలు కలిగియుండు. 
@ మంచిఉద్దేశాలు, మంచిఆశలు, మంచిమాటలు, మంచిప్రవర్తన, మంచి బ్రతుకుదెరువు, మంచి ప్రయత్నం, మంచిఆలోచనలు, మంచి ఉల్లాసం అనే ఈ అష్టాంగ మార్గంలోనే బుద్ధుడి తత్వశాస్త్ర మూలాలు ఉన్నాయి.
@ మంచి పుస్తకం విజ్ఞానాన్ని యిస్తుంది,  మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. యన్. కె.  కృపసాయ
@ మంచి మనిషి ఆలోచన ఎన్నడూ వృధాకాదు. గాంధీజీ
@ మతం మనిషి  వెన్నెముకను విరగగొడుతుంది. అంతేకాదు,స్వతఃసిద్ధ ఆలోచనాశక్తిని, మనసును గట్టిగా గుప్పిటతో నలిపి మరీ చంపుతుంది. 
@ మనిషి ఆలోచనలకు బందీ.  ఆలోచనలను మార్చుకోనిదే దేన్నీ మార్చలేడు.
@ ఆలోచన దిశ మార్చుకోగలిగితే జీవిత దశకూడా మారుతుంది. బిల్ గేట్స్
@ మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది.  ఎమర్సన్
@ ఆలోచనల స్థాయికి తగినవాళ్ళతోనే  స్నేహం చేయాలి, లేకుంటే అలాంటి మిత్రత్వం ఎప్పటికీ సంతోషంగా ఉంచలేదు. చాణక్య
@ మన ఆలోచనలన స్వభావాన్ని మార్చడమే హాస్యానికుండే రసాయనిక ప్రయోజనం.  లిన్ యుతంగ్
@ జ్ఞానాన్ని, ఆలోచనలనూ ఒకేచోట ఉంచి ఐక్యమత్యంగా పని చేయుదము గాక! అధర్వణ వేదం
@ మననం చేసుకోవటం, ఆత్మావలోకనం మంచివే, కాని పరిమితి మించరాదు.
@ ఆత్మావలోకనం అతి అయితే జీవితం దుర్భరం అవుతుంది. అప్పుడు పని మోతాదు పెంచి ఆలోచనా మోతాదు తగ్గించాలి.
@ మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే. వివేకానంద
@ మనిషి ఆలోచనలు అతని జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మార్కస్అరిలియస్

కామెంట్‌లు