"గుణము-సుగుణము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
కం.
గుణమేప్రధానమందురు
గుణమేసత్కీర్తినింపుకుదురుగనెపుడున్
గుణమేమనిషికిసతము సు
గుణమైయలరారుచుండుకోకొల్లలుగన్!!!
02.
కం.
చెడుగుణములవిడువవలయు
నడవడికకుచేటుదెచ్చునానావిధముల్
ఒడిదుడుకులనేర్పర్చియు
పడగొట్టునుజీవితంబుఫలితంబిడకన్!!!
03.
కం.
సుగుణముభూషితమౌగా
సుగుణముతోనున్నవాడుసూరియెకనగన్
సుగుణముతోపనులన్నియు
సుగుణముతోజరిగిపోవుసుందరముగనే!!!
04.
కం.
మానవధర్మముగుణమని
మానితముగజెప్పినారుమనఋషివరులున్
మానసమందుననిల్పుము
మానవలోకంబునకునుమంచియెజరుగున్!!!కామెంట్‌లు