"సేవాతత్పరత-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
ఆ.వె.
మూగచెవిటిగ్రుడ్డిరోగాలవారికి
సేవజేయవలెనుచెంతనిల్చి
అటులజేసినపుడుఆదేవుమెచ్చును
"తప్పవలదురంజితన్నమాట"!!!

02.
ఆ.వె.
పరులసేవలోననిరతమ్ముతరియించ
పుణ్యగతులుగల్గుపూర్తిగాను
దీనిమించితృప్తిదేనిలోనుండదు
"తప్పవలదురంజితన్నమాట"!!!

03.
ఆ.వె.
చేతులున్నవివిగొసేవసేయుటకును
సేవకొరకుభావిజీవితంబు
సేవజేసిధన్యజీవితమ్ముగడుపు
"తప్పవలదురంజితన్నమాట"!!!

04.
ఆ.వె.
ఈకరోనవల్లనిబ్బందిపాలైన
చిన్నిసేవనైనచేసినట్టి
జనులదలుతుగొలుతుమనమునందుననేను
"తప్పవలదురంజితన్నమాట"!!!

కామెంట్‌లు