"పనియేదైవము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
కం.
పనియెదైవంబనుచును
పనులనుచేసినఫలితముప్రాప్తించునుగా
పనిజేయుటమనబాధ్యత
పనిలోసంతృప్తిదొరుకువసుధాస్థలిలో!!!
02.
కం.
కర్తవ్యమునెరవేర్చుము
కర్తవ్యములోనదాగుకష్టసుఖంబుల్
కర్తవ్యమువిడిచినగని
పూర్తిగసోమరిగమారిబుద్ధినశించున్!!!
03.
కం.
పనిజేయుటసిగ్గనితా
పనిమానుచుతిరుగువారుభారముభువికిన్
పనితనమునుజూపించియు
ననుదినమున్ విధులుసలుపనానందంబౌ!!!
04.
కం.
చేసేపనిలోధైర్యము
వేసేప్రతియడుగునందువేల్పుయెతోడౌ
నీసరిలేరెవ్వరనుచు
చూసినప్రతివారునీకుశుభమనిపల్కున్!!!


కామెంట్‌లు