"నమ్మకము-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
నమ్మకమేనీధర్మము
నమ్మకమేతోడునీడనమ్ముమునరుడా
నమ్మకమేబ్రతుకుదెరువు
నమ్మకమేగల్గియుండున్యాయముతోడన్!!!

02.
కం.
నమ్మినవారలనెప్పుడు
వమ్మునుజేయంగరాదుపాపములంటున్
యిమ్మహిలోనధికంబును
నమ్మినవారలనుముంచునట్టేటగదా!!!

03.
కం.
నమ్మకమేమేల్జేయును
నమ్మకమేవృద్ధినొసగునచ్చినవిధమున్
నమ్మకమేపెన్నిధియౌ
సమ్మతముగనమ్మకంబుసత్ఫలితమిడున్!!!

04.
కం.
నమ్మకమేజీవితమని
నమ్మితినేయందరిసరినమ్మితిమనమున్
నమ్మితిహితులనుశ్రేష్ఠుల
నమ్మితిసద్గుణవరులనులనమ్మితినయ్యా!!!కామెంట్‌లు