సద్దులబతుకమ్మ-సీసమాలికాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
పుష్పములనుపేర్చిపుణ్యాంగనలుగూడి
భక్తితోబతుకమ్మపాటపాడి తొమ్మిదిరోజులుఅమ్మలక్కలుమెండు
గౌరిమాతనుగొల్చుఘనముగాను
పల్లెపట్టణములుప్రాభవమ్మొప్పంగ
హోరెత్తుచుండునుజోరుగాను
మనసంస్కృతినిచాటిమనసాంప్రదాయాల
ఆచారములదెల్పునాతృతముగ
తెలగాణఖ్యాతికినిలువెత్తురూపమై
అలరారుచుండునుఅవనిపైన
పూలకుంభపుమేళపులకింతగొల్పగా
ప్రకృతిమురిసిపోయిపరవశించు
సృష్టిసీమంతమునిష్టగాజరిపించు
అతివలందరుజూడవ్రతముగాను
ఉయ్యాలపాటలుఊపందుకొనెగాదె
అలుగుదుంకినతీరుకలియదిరిగె
విశ్వవ్యాప్తినిపొందె,విరులసింగిడియిది
చరితసృష్టించినతరగనినిధి
రాష్ట్రోత్సవమ్మైవిరాజిల్లుతున్నది
కళలకాణాచియైకాంతులొలికి
సబ్బండవర్ణాలసఖ్యతసాధించి
చేతనత్వమునింపుచేవతోడ
బతుకమ్మపండుగప్రాభవంబునుగూర్చి
ప్రస్తుతించిరికవుల్ పలువిధాల
ఆడపడుచులకుఆనందవేడుకై
సంతోషమునుగూర్చుసంభ్రముగను
(తే.గీ.)
అమ్మబతుకమ్మబ్రతుకులోనమ్మకంబు
కలుగజేయుచునిలుచున్నక్రాంతదర్శి
జన్మజన్మాలబంధమైశాశ్వతముగ
నిలిచి,సౌభాగ్యవరదాయిఫలములొసగు!!!

కామెంట్‌లు