"తెలంగాణధీరవరులు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
సీ.
వట్టికోటాళ్వారుగట్టికోటగనిల్చి
తెలగాణగోడునుతెలియపరిచె
దాశరథీకవిదర్పమ్మునేజూపి
అగ్నిధారలుజిమ్మెనవనియందు
కాళోజికవనంబుకమనీయతనుచాటి
తిరుగుబాటుతనముమరులుగొల్పు
సుద్దాలహనుమంతుసుందరమొప్పంగ
పాటపూదోటలైపరిమళించె
చాకలిఐలమ్మసాహసమ్మునుజూపి
ఉద్యమానికితానుఊతమయ్యె
(తే.గీ.)
మనతెలంగాణసమరముఘనతకెక్కె
రచనలెన్నియోజేసిరిరంజితముగ
వారిఆశయపథమునువదలకుండ
సాగిముందుకుపోవాలిసకలజనులు!!!

కామెంట్‌లు