"సంతోషము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467

 01.
కం.
సంతోషముసగబలమని
సంతోషముజీవితంబుసాగినయెడలన్
సంతోషమెసంతోషము
సంతోషముకన్నమిన్నసంపదలేదే!!!

02.
కం.
సంతోషముసతతంబును
చింతలుదరిజేరకుండచిగురించుభువిన్
ఇంతకుమించినపెన్నిధి
యెంతకుకనిపించలేనిదిదియేగాదే!!!

03.
కం.
సంతోషసాగరంబును
సంతసముననీదవలెనుసమ్మతితోడన్
సంతోషముకైసమయము
నెంతయొవెచ్చించవలెనునెప్పటికైనన్!!!


కామెంట్‌లు