"బాలలకు ఉద్బోధ-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
ఆ.వె.
బాలలారమీరుభవితనేలగరండి
కష్టపడియుచదివికలలనన్ని
నిజముజేసుకొనుటనిత్యమ్ముమరవద్దు
"సత్యశీలులారసాగిపొమ్ము"!!!
02.
ఆ.వె.
పెద్దవారిమాటముద్దుగావినుచును
చేతనైనపనులుచేయుమెపుడు
పరులసేవకొరకుపాటుపడినచాలు
"సత్యశీలులారసాగిపొమ్ము"!!!
03.
ఆ.వె.
మాటమాటయందుమాధుర్యమొప్పెడి
మాటలాడవలెనుమంచిదవును
మాటవలనమేలుమాటవలనకీడు
"సత్యశీలులారసాగిపొమ్ము"!!!
04.
ఆ.వె.
అమ్మనాన్నగురువులారాధ్యదైవాలు
వారియందుభక్తివదలరాదు
వీరిప్రేమపొందివిజయాలనొందుచు
"సత్యశీలులారసాగిపొమ్ము"!!!


కామెంట్‌లు