"మనభారతదేశము-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
మనదేశముసుందరమిల
మనదేశమురత్నగర్భ;మనయాచారాల్
మనదేశమునందుగలవు
మనదేశపుసంస్కృతులనుమరువకుమెపుడున్!!!
02.
కం.
గౌరవమునునిచ్చుకొనుచు
భారతప్రాభవముచాటుప్రజలందరిటన్
భారతమాతనుగొల్చుచు
భారతచరితనుతెలుపునుపరిపరివిధముల్!!!
03.
కం.
మమతానురాగబంధము
సమతనుచాటించుచుండుసమముగనిచటన్
అమలహృదయాంతరంగులు
కమనీయతతోసలుపునుకర్తవ్యములన్!!!
04.
కం.
పరమతసహనముననియెడి
విరులనుపూయించుచుండుప్రేమాంకృతమై
మురియుచుప్రగతినిపెంచుచు
ధరపైవర్థిల్లుచుండుదండములిడుచున్!!!


కామెంట్‌లు