సూక్తులు- ఆలోచన.7- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com
 @మనిషి ఆలోచనా శక్తికి ఫలితమే సంపద .  ఐన్ రాండ్
@మనిషి జీవించేది సంవత్సరాలలో కాదు, చేసిన పనుల్లో, శ్వాసల్లో కాదు ఆలోచనల్లో.  అరిస్టాటిల్ 
@మనం మోయగలదాన్ని బట్టి శారీరక బలాన్ని, భరించగల దాన్ని బట్టి ఆధ్యాత్మిక బలాన్ని కొలుస్తారు. 
@ప్రగతిని నిర్దేశించేది అదృష్టం అనుకోవటం అందమైన భ్రమ. మనో ఆలోచనలతోనే అది సాధ్యపడుతుంది. ధోరో
@మనుషులు ఆలోచనలకు బందీలు.   ఆలోచనలను మార్చుకోనిదే దేన్నీ మార్చలేం. 
@నరుని ఆలోచన నిరంతరం పురోగమిస్తుంది. ప్రకృతి,విశాల విశ్వ సంబంధ సమస్యలను, పరిష్కారాలను అవగాహనకు ప్రయత్నిస్తుంది. 
@మానవుని అన్ని శక్తులకంటే అద్భుతమైనది ఆలోచనా శక్తి.
@మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి,  బలహీనపరచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.  వివేకానంద
@ప్రవర్తన, ఆలోచన, భావాల ఆధారంగా మీరు ఏ తరహా శ్రేణికి చెందిన వ్యక్తులో తెలిపేది మీ వ్యక్తిత్వం.  కేంబ్రిడ్జ్ నిఘంటువు
@మేధావులను కదిలించేది వారికి ప్రేరణ యిచ్చేవి కొత్త కొత్త ఆలోచనలు కావు, ఒక్క ఆలోచన కోసమే పరితపించటం.
@మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి.   రామకృష్ణ పరమహంస 
@రోజువారి ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం. ఐన్ స్టీన్
@లక్ష ఆలోచించినా ఉపయోగం లేదు.   వేయి చెప్పినా ఫలితం రాదు.  ఏదో విధంగా నూరు పనులు చేసినా ఫలితం శూన్యం. శాస్త్రీయ @ఆలోచనలతో కూడిన ఆచరణతో ఒక మంచి పనిచేసి ప్రయోజనం పొందటమే  అన్నిటికన్నా మిన్న. 
@లక్ష్యనిర్దేశం అంటే నీలో ప్రకృతిసిద్ధంగా ఉన్న విజయవ్యవస్థను చైతన్యపరిచే  ఆలోచనాత్మక వ్యాయామం . డేల్ స్టాపుల్స్
@విజయానికైనా, అపజయానికైనా, మనిషి అతని ఆలోచనలు, పనులే కారణాలు. 
@విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే.
@కిందపడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేము.  అబ్దుల్ కలాం
@ విజేతలు సకారాత్మక ఆలోచనాపరులు, వాళ్లు అన్నిట్లో మంచిని చూస్తారు, సాధారణమైన వాటిని అసాధారణంగా మలుచుకుంటారు.కామెంట్‌లు