పుడమితల్లి:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464
ఆకుపచ్చని కోక సింగారం నీ తనువు
గలగల పారే జీవనదుల అందమే నీవు
పర్వత లోయల హొయల ఒయ్యారానివి.

పురిటి నొప్పులెన్నొ భరించు మనతల్లి
పచ్చిబాలింతయై సాదుకొను పుడమితల్లి
సకల జీవరాసుల కాలవాలమై తాను.

తన వంటి శక్తినంత కూడగట్టుకొను
ప్రకృతి సంపదతో పరవశింపజేయు
మట్టిలోని సిరులనెన్నో పండింపజేయు.

తన గుండెలో గుణపములెన్ని గుచ్చినను
మలమూత్రాల కంపు నింపినను
సహనంతో తనవారినొడిలోనే దాచుకొను.

వ్యర్థాలతో అనర్థాలు ముంచుకొచ్చే
ప్లాస్టికు జీర్ణం కాక వలవల వగచే
తరిగి పోతున్న వనాలతో దుఃఖించే.

తనదని కొట్టుకొనే నరహంతకులను
భూభాగానికై ప్రాణాలు తీసే కసాయిలను
చూచిన ధరణిమాతా ఫక్కున నవ్వేను.

భూకంపాల బెరుకులను తట్టుకొని
భూకబ్జా కోరుల చేతుల్లోoచి నెట్టుకొని 
తన గమనంతో అహిమకరుని అనుసరించే.

తొలకరితో పులకరించిన తనమేను.
రైతన్నల దిగులు చూచి వగచేను.
సిరుల దిగుబడులిచ్చి వెలుగు నింపేను.కామెంట్‌లు