ముత్యాలహారాలు;---చైతన్య భారతి పోతుల 7013264464
 411.
ఉషోదయపు కాంతులు
ఉప్పొంగే మనసులు
చూడండీ పిల్లలు
లేవండోయి నిద్రలు
412.
సర్దండీ ..! పుస్తకాలు
చకచక మీరు పరుగులు
తీయండీ..!బాలలు
పిలిచేనోయి బడులు.
413.
విజ్ఞానపు వెలుగులు
విరజిమ్మును బాలలు
రావాలి.!పాపలు
ఎదురు చూసే బడులు
414.
మీవే ఆటలు పాటలు 
అల్లరి కేరింతలు
తోటలో తుమ్మెదలు
మీరేలే అమ్మలు
415.
గురువుల హృదయాలు
ఎదురు చూపుల ఆశలు
పంచును ఆప్యాయతలు
పొందండీ.!కన్నలు

కామెంట్‌లు