"ముత్యాల హారాలు";-విస్లావత్ శైలజ-పదవ తరగతి-జడ్.పి.హెచ్.ఎస్ నేరళ్ళ పల్లి ఉన్నత పాఠశాల7013264644

 13.
పుస్తకాన్ని దాచుకో
జ్ఞానాన్ని పెంచుకో
విలువలను తెలుసుకో
చదవడం నేర్చుకో
14.
పోతన్న యొక్క కవితలు
ఎందరో ప్రజల భవితలు
అందులోని రాతలు
మనిషి మార్పుకు ముత్యాలు
15
ఆంజనేయ దేవుడు
వాయువులో ఎగిరె పుత్రుడు
ప్రతి ప్రాణి సేవకుడు
ప్రాణాల రక్ష దీరుడు
16.
చెడును నువ్వు చూడకు
చెడు మాటలను వినకు
చెడుపనులను చేయకు
చెడు వైపుకు వెళ్ళకు
17.
ఆడపిల్లల అందం 
అమ్మింటి ప్రేమ బంధం
అత్తింటి అనుబంధం
పొరుగింటి సంబంధం
18.
పుస్తకం యొక్క బంధం
జ్ఞానం తో సంబంధం
వీటి మధ్య అనుబంధం
చదువే శిశులకు అందం
19.
ఫోన్లను వాడుకోకు
వేరే మాయలో పడకు
తిక్క విడియోలు చూడకు
చెడు లో ప్రయాణించకు.
20.
అన్నదానం చేయండి!
అందరి కడుపు నింపండి!
లేని వారిని పిలవండి!
దానం చేసి పంపండి!
21.
ఆచారంను వదులొద్దు
అహంకారం ఉండద్ధు
అన్నింటికి చదివే ముద్దు
చదువులను మరువద్దు 
22.
ఓడిపోయ ననుకోకు
జయించానని మరవకు
చెడు లో ముందు ఉండకు
అందులో మునిగి పోకు
23.
మన దేశ శాస్త్రజ్ఞులు
భవితను చెప్పే పౌరులు
గుర్తింపబడే ధీరులు
నిజాలు చెప్పే వీరులు
24.
పొగకు దూరం ఉందాం
మద్యం వదులు కుందాం
గంజాయి మాను కుందాం
సుఖంగా జీవిదాం
25.
మంచి కలలు కనండి
కల సాకారం చేయండి
తండ్రి మాటను వినండి
తల్లి ఆయువు పొందండి
26.
ఆకాశాన మేఘాలు
ఆకర్షించే రాగాలు
నక్షత్రాల మెరుపులు
చందమామ సవ్వడులు
27.
పక్షుల యొక్క కిలకిలలు
పాట పాడే రాగాలు
కష్టం మరిచే మనుషులు
ఆనందం పొందు జీవులు
28.
పొద్దున్నే లేస్తాము
యోగా ధ్యానం చేయుము
ఇంటి పనులు చేస్తాము
ప్రపంచం చూస్తాము
29.
ఆనందంగా ఉండుము
ఆరోగ్యాన్ని పొందుము
కష్టాలనే నమ్ము ము
సుఖాలకే చేరుము
30. 
ఉన్నవాడు ఉరుకుతాడు
లేనివాడు అడుగుతాడు
 మధ్యలో మామూలుంటాడు
ఇలా జీవిస్తుంటాడు
31.
స్టయిలు గా ఉండకండి
సంసారం చెడపకండి
సహజంగా సాధించండి
మంచి స్థాయిలో వెళ్ళండి
32. 
కవర్ల ఉపయోగం
ఉపయోగిస్తే చెడు యుగం
ప్లాస్టిక్ వాడే సగం
ప్రాణాలు తీయు జగం
33. 
అబ్దుల్ కలాం వేదన
ఎవరు తీర్చని రోదన
ఎన్నో కష్టాలు పడిన
గమ్యానికి తన చేరెన.
34. 
అర్థం కాని మాటలు
చేసే చిలిపి చేష్టలు
నవ్వు పుట్టించే పాటలు
అదే మన పిల్లల పనులు
35. 
అన్న,చెల్లె అనుబంధం
ఎన్నో జన్మ సంబంధం
అందరిలా ఈ బంధం
ప్రేమ నిచ్చే మకరందం

కామెంట్‌లు