*తాత నువ్వంతే... మేమింతే*:-"రసస్రవంతి" 7075505464" కావ్యసుధ " 9247313488( కవి ద్వయం : హైదరాబాద్)

 తాత నువ్వు హింసను బోధిస్తే
మేము హింసకు అలవాటు పడ్డాం !
నీవు సత్యమార్గం చూపిస్తే
మేము
అసత్యమార్గంలో నడుస్తున్నాం
నీవు సత్యాగ్రహాలు చేసి సాధిస్తే
మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాం!
నీవు నీతికి కట్టుబడి నడిచావు
మేము
అవినీతిని పెట్టుబడి చేసుకున్నాం 
ఇది నీ కాలం కాదు తాత 
కలికాలం
నువ్వంతే.... మేమింతే.....
ఒక చెంప కొడితే
మరో చెంప చూపించ                       
 మన్నావు ఆనాడు
ఒక చంపే కాదు రెండు చెంపలు వాయిస్తున్నారు ఈనాడు
నీవు చెప్పిన నీతి పాఠాలు
మా చెవికెక్కలేదు తాత 
కండకావరం పట్టి          
కామం పొరలు విప్పి
పట్టపగలే సామూహికంగా
మానభంగాలు చేస్తున్నారు
తాత నువ్వేమో
అర్ధరాత్రి స్త్రీ
స్వతంత్రంగా తిరిగిన నాడు 
స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పావు, కానీ....
నీవు చెప్పిన బాటలో నడిచే                        
  కాలం కాదు తాత ఇది
కలికాలం దౌర్జన్య కాలం 
అవును తాత నాకో విషయం చెప్పు...!
అర్ధరాత్రి ఆడది ఎందుకు తిరగాలి ?
కామాంధులకు
బలికావడానికా ?!
నీవు వట్టి అమాయకుడువు                          
   తాత... ఏదో చెప్పేసావ్ 
ఇది నీ కాలం కాదు కలికాలం
ఈనాడు ప్రపంచములో 
విజ్ఞానం శాఖోపశాఖలుగా                            
విస్తరించింది
విచ్చలవిడితనం విషసర్పమై                    
     పడగ విప్పి నాట్యం చేస్తోంది
అవినీతి నడిబజారులో
వలువలు విప్పు కుంటుంది
అలనాటి నీ పద్ధతులు
మాకు నచ్చవు తాత.....
నువ్వంతే ....... మేమింతే
లోకం ఒక వింతే !
జాతిపితగా నీవు కీర్తింప పడ్డావు
చాలు తాత నీ కీర్తి అజరామరం*

కామెంట్‌లు