సూక్తులు- ఆలోచన.8- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com

 @విజ్ఞాన ప్రభావం పెరిగేకొలది అసంబద్ధ ఆలోచనలు, చాదస్తపు అలవాట్లకు త్వరతగతిని స్వస్తి చెప్పటం జరుగుతుంది.  శాస్త్ర విరుద్ధ విధానాలను వదులుకోవటం ఎక్కువ అవుతుంది. నెహ్రూ
@విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు, క్రమ శిక్షణాసహితంగా లేకపోతే వారి చదువంతా వృధా.
@విలువైన ఆలోచనలు వున్నవారు జీవితంలో ఎన్నటికీ ఒంటరివారు కారు. 
@శరీరం ఆలోచనలకు బానిస కనుక, ఆహారాన్ని మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు, ముందు ఆలోచన మార్చు. జేమ్స్ ఎలెన్ 
@శరీరవైకల్యం పెద్ద సమస్యకాదు.  ఆలోచనలు  అవిటివి అయితేనే సమస్య. ప్లీనీ
@శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ఆలోచన అంత అవసరం.  సిసిరో
@శాస్త్రం మానవుని హేతువాదం, ఆలోచనాశక్తి నుంచి సునిశితంగా బయల్దేరుతుంది. హెకెల్
@సంఘటనల క్రమాన్ని, వాటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని వాటి ఆధారంగా జీవితతత్వాన్ని రూపొందించుకొని దాన్ని మానవ జీవనరంగాలన్నిటికీ అన్వయించుకునే ఆలోచనా విధానమే హేతువాదం. 
@సంతోషానికి సాకు ,  ఆలోచనకు ఆకృతి లేదు.
@సంతోషాన్ని పొందటానికి రెండు మార్గాలు.  ఒకటి ఉన్న పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవడం, రెండోది ఆలోచనా తీరు మార్చుకోవడం.   ఆస్కార్ వైల్డ్
@సరైన ఆలోచన లేని మనిషి నిజంగా మూర్ఖుడే.  శంకరాచార్య
@సరైన ఆలోచనలు లేని మనుషులు దుఃఖ సాగరంలో మునిగిపోతారు .  రుగ్వేదం
@సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా నీ వెంటే ఉంటుంది. బుద్ధుడు
@సుదీర్ఘ ఆలోచనలో ఒక మార్గం ఏర్పడుతుంది.   అవిశ్రాంత పరిశ్రమతోనే అది విజయవంతం అవుతుంది. 
@సులభంగా అర్ధమయే పుస్తకాలే సాధారణంగా  మంచివై ఉంటాయి.  భాష జటిలంగా రాసి, అస్పష్ట ఆలోచనలు అల్లే వాడి ఆలోచనల్లో స్పష్టత ఉండదు.  లార్డ్ చెస్టర్ ఫీల్డ్
@సైన్సు,మతం,విజ్ఞాన శాస్త్రాలు, సిద్ధపురుషులు పరస్పర వ్యతిరేక దిశలలో వర్తులాకారబాటలో పయనిస్తున్నారు నేటి మానవునికి ఇరువురి ఆలోచనల అవసరమున్నది. 
@సౌందర్య ఛాయాచిత్రం అంటే అదొక ఆలోచనా విధానం, సౌందర్య ఆరాధన, ఒక ప్రత్యేక శైలి.
@ హేతువాద ఆలోచనలతో ఏదైనా చేస్తే అది వాస్తవికత కలసి  ఉంటుంది. 

కామెంట్‌లు