అమ్మప్రేమ(కవిత):-కేతావత్ చరణ్ 8వ తరగతిZPHS నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

 అమ్మ నీకు నా వందనాలు..
నేను చూసిన తొలి రూపం,
నేను పలికిన తొలి పలుకు నీవే.. 
నేను తలచిన తొలి దైవం ,
నేను చేసిన తొలి స్నేహం నీవే.. 
నేను నడిచిన తొలి అడుగు నీతోనే ..
నేను తిన్న తొలిముద్ద నీతోనే.. 
నేను చేసిన తొలి ప్రేమ నీవే..
నా సర్వo నీతోనే ముడిపడే.
కాలాలు మారినా..
దేశాలు మారినా..
నా ఊపిరున్నంత వరకూ..
నిన్ను మరువా..
ఏ పడవిలోనున్నా..
పేదరికంలో నున్నా..
నీ ప్రేమే నాకు శాశ్వతం..
మరో జన్మoటూ ఉంటే..
నిన్నే అమ్మగా ఇవ్వాలని దేవుణ్ణి మొక్కుతా..
కామెంట్‌లు