విధాత:-డా!! బాలాజి దీక్షితులు పి .వి--తిరుపతి8885301722

 భరువు తాడలేనని
భువిజ ప్రాదేయ పడిందో
వెలిసిన ప్రకృతి
అలసి సాగిలపడి అడిగిందో
బాధతో నిండిన ఆత్మలు
చేసిన తపస్సు ఫలించిందో
తెలియదు కానీ
బ్రతికున్న వాడికి
క్షణమొక భయంకర
నిజంలా మారింది
భవిష్యత్తు అంతాయు
అంధఁకారమై కనిపిస్తోంది
చచ్చే శవానికి
సానుభూతి లేకుండాపోయింది
తలకొరివి పెట్టె
బాధ్యత కూడా ఇవ్వకుండా చేసింది
కోతికొమ్మచ్చి లాంటి
మనసని మనలని నమ్మటం లేదేమెా
అన్ని నేర్చుకుంటాం అని ప్రార్దిస్తున్నా
మనలని నమ్మ గలిగిన... దేవుడెవరు
ఓ విధాత...
నీ చేతిన దాగింది మా రాత


కామెంట్‌లు