శ్రమజీవులం (బాల గేయం);-పాత్లావత్. పురందాస్ 9 వ తరగతిZPHS నేరళ్ళపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464
వ్యవసాయాన్ని నమ్మినవాళ్ళం,
తోడు నీడై నడిచే వాళ్ళము.
బుద్ధిబలాన్ని ఎరిగిన వాళ్ళం,
నమ్మకంతో సాగే వాళ్ళము.

భక్తిని కలిగి ఉండేవాళ్ళం,
ప్రేమను మేము చూపే వాళ్ళము.
దయాగుణం కలిగి ఉండే వాళ్ళం,
అత్యాశాన్ని ఖండించే వాళ్ళము.

మంచి పేరును పొందిన వాళ్ళం,
కష్టంలోనా ఆదుకునే వాళ్ళము.
సంప్రదాయాలను గౌరవించే వాళ్ళం,
మంచి గుర్తింపు కలిగిన వాళ్లము.

కష్టసుఖాలను అనుభవించే వాళ్ళం,
చెమటోడ్చి పని చేసేవాళ్ళము.
నా దేవతలను పూజించే వాళ్ళం,
వరాలనెన్నో పొందే వాళ్ళము.


కామెంట్‌లు