"ముత్యాల హారాలు":-పాత్లావత్ పురందాస్ 9వ తరగతిZPHS నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

 1.
గురువుల మాట వినుము
మంచి దారిలో నడువుము
నీ లక్ష్యం సాధించు ము
ఆనందం నీ సొంతము.
2.
అక్షరం నేర్చుకో
నీ తెలివిని పెంచుకో
నీ లక్ష్యాన్ని అందుకో
జీవితం సాధించుకో.
3.
అక్షరాన్ని నమ్ముకో
మంచి దారిని తెలుసుకో
జ్ఞానాన్ని పెంచుకో
నీ కలని సాధించుకో.
4.
నీలాల నింగి నే
చూస్తేనే హాయినే
ఎగురుతుంటే బలేనే
పరవశించి పోయానే.
5.
ఆటలంటే మాకిష్టం
పాటలంటే మాకిష్టం
బాలభంటే మాకిష్టం
హాయిగుంటే మాకిష్టం.

కామెంట్‌లు